Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతియుత ధర్నాకు అనుమతి కోరిన మండల అద్యక్షుడు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 2:59 PM విజయనగరంGeneral
శాంతియుత ధర్నాకు అనుమతి కోరిన మండల అద్యక్షుడు - Udayam
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో 1450 మందికి ఇల్లు పట్టాలు మంజారై 5 ఏళ్లైనా కమిషనర్‌, MRO స్థలాలను ఇప్పటికీ గుర్తించలేదని BJP మండల అధ్యక్షుడు మైపాడ ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ విషయంపై విషయమై ఈనెల 24వ తేదీన నగర పంచాయతీ ఆఫీస్‌ నుండి మండల తాసిల్దార్‌ ఆఫీస్‌ వరకు శాంతియుత నిరసన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎస్సై గోపాల్‌ రావుకు అనుమతి పత్రం అందజేశారు.

Comments

G
Loading comments...