వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం నేవీ, కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్లు, యుద్ధనౌకలతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. గంగవరం పరిసర ప్రాంతాల్లో గాలింపును విస్తృతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం సముద్రంలో అలల తీవ్రత, బలమైన గాలుల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. బాధితుల కుటుంబాలకు అండగా ఉండాలని, హోంమంత్రి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సీఎం తెలిపారు.
Comments
Loading comments...

