వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా కరణంవారిపల్లె ప్రాథమిక పాఠశాలకు స్టేట్ సోలార్ పవర్ కార్పొరేషన్ రూ. 4 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఇందులో రూ. 1.30 లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డును సీనియర్ మేనేజర్ అశోక్ మంగళవారం ప్రారంభించారు.
మిగిలిన రూ. 2.70 లక్షలను మరుగుదొడ్ల పైకప్పు, ఫర్నిచర్, బుక్ రాక్స్ కోసం కేటాయించారు. పాఠశాల డిజిటల్ అభివృద్ధికి సహకరించిన అధికారులకు హెచ్‌ఎం రమణారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

