Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సులు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 07, 2026 2:45 PM తిరుపతిGeneral
తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సులు - Udayam
తిరుమలకు నడిచే ఎలక్ట్రిక్ ఏసీ బస్సు సర్వీసులు మంగళవారం తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రతి డ్యూటీలో ఐదు ట్రిప్పులు వేయాలన్న యాజమాన్యం ఆదేశాలపై అలిపిరి ఆర్టీసీ డిపో డ్రైవర్లు విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. ట్రాఫిక్ దృష్ట్యా రోజుకు మూడు నుండి నాలుగు ట్రిప్పులు మాత్రమే సాధ్యమని డ్రైవర్లు స్పష్టం చేస్తున్నారు. యాజమాన్యం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టడంతో భక్తుల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...