వార్తలకు తిరిగి వెళ్లండి

వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా బడులు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థుల కోలాహలంతో ప్రాంగణాలు కళకళలాడుతున్నాయి. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి ఆకర్షణీయమైన కొత్త యూనిఫాంలను అందుబాటులోకి తెచ్చింది.
మొదటి రోజే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. కొత్తగా ‘బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ను కూడా ప్రవేశపెడుతున్నారు. శుభ్రత, తాగునీరు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు.
Comments
Loading comments...

