Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 17 నుంచి స్కూళ్లలో తనిఖీలు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 11, 2026 6:53 AM హైదరాబాద్General
ఈ నెల 17 నుంచి స్కూళ్లలో తనిఖీలు - Udayam
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 17 నుంచి తనిఖీలు చేపట్టేందుకు విద్యాశాఖ 307 అకడమిక్ ప్యానెల్ బృందాలను ఏర్పాటు చేసింది. బోధన, వసతులు, విద్యార్థుల హాజరు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించనున్నాయి. బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగా పాఠశాలల్లో ఉన్న లోపాలను సరిదిద్దే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...