వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం విశ్వజ్యోతి జూనియర్ కళాశాల వెనుక సత్తారు మురళి నగర్‌లో కుక్కలు గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని స్థానికులు తెలిపారు.
ఇటీవల కుక్కల దాడిలో పలువురు ఆసుపత్రిపాలయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

