Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సతీశ్‌రెడ్డికి ఛేంజ్‌మేకర్‌

శ్రుతి రెడ్డి Jul 26, 2026 8:34 PM హైదరాబాద్about 1 hour ago
సతీశ్‌రెడ్డికి ఛేంజ్‌మేకర్‌ - Udayam Digital
డీఆర్డీవో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి ‘ఛేంజ్‌ మేకర్‌’ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సినీనటుడు చిరంజీవి చేతులమీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. క్షిపణి సాంకేతికత, రక్షణ రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి సత్యకుమార్‌, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...