Back to feed
పీజీ కాలేజీగా సనత్ నగర్ టిమ్స్
Rohit Verma May 26, 2026 1:03 PM హైదరాబాద్ 27 views1 day ago

సనత్ నగర్ టిమ్స్‌ను ఎంబీబీఎస్ లేకుండా నేరుగా పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు అందించే స్వతంత్ర వైద్య కళాశాలగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిమ్స్ తరహాలోనే సొంత వర్సిటీ హోదా ఉండే ఈ సంస్థలో సుమారు 150 పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడ విద్యా అవసరాల కోసం ఐదంతస్తుల అకాడమిక్ బ్లాక్, లెక్చర్ హాల్ నిర్మించారు. వెయ్యి బెడ్ల సామర్థ్యం, 29 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో కూడిన ఈ హాస్పిటల్ సేవలను జూన్ మొదటివారంలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...



