Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటుతో సమ్మక్క ప్రియ మృతి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 10, 2026 6:35 AM తూర్పుగోదావరి General
పాముకాటుతో సమ్మక్క ప్రియ మృతి - Udayam
కూనవరం మండలంలోని కార్మానుకొండ గ్రామానికి చెందిన కొండరెడ్డి తెగ యువతి సమ్మక్క ప్రియ(18) పాముకాటుతో మరణించింది. డోలీ సహాయంతో కొండల మధ్య ఏడు కిలోమీటర్లు మోసుకుంటూ కూటూరు ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. అక్కడి నుంచి చింతూరు, భద్రాచలం దాటుకుంటూ గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తమ కుటుంబాన్ని ఐటీడీఏ అధికారులు ఆదుకోవాలని బాధిత తండ్రి లక్ష్మారెడ్డి వేడుకున్నాడు.

Comments

G
Loading comments...