Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాజిద్‌ అక్రమ నిర్మాణాల చిట్టా

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:12 AM హైదరాబాద్General
సాజిద్‌ అక్రమ నిర్మాణాల చిట్టా - Udayam
అంజయ్యనగర్‌లో కూలిన ఏడంతస్తుల భవన నిర్మాణదారుడు సయ్యద్‌ సాజిద్‌పై పలు అక్రమ నిర్మాణాల ఆరోపణలు వెలుగుచూశాయి. 38 గజాల స్థలానికి నాలాను ఆక్రమించి మరో 10 గజాలు కలిపి భవనం నిర్మించినట్లు ఆరోపణలున్నాయి. మూడేళ్లలో ఐదు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన సాజిద్‌, ప్రస్తుతం మరో రెండు నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి పరారైనట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...