Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై జాగ్రత్త.. వారం రోజుల్లో 27 ఫిర్యాదులు

Follow Udayam on Google
Alluri Mahesh Oct 03, 2026 6:46 PM ఆదిలాబాద్General
సైబర్ నేరాలపై జాగ్రత్త.. వారం రోజుల్లో 27 ఫిర్యాదులు - Udayam
సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లాలో వారం రోజుల్లో 27 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. రుణాలు, ఉద్యోగాలు, పెట్టుబడులు, వివాహ పరిచయాలు, వాట్సాప్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. ఓటీపీ, యూపీఐ రహస్య సంఖ్య, బ్యాంకు వివరాలు పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...