Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాల పట్ల వయోవృద్ధులు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Sudheer Sep 28, 2026 5:57 PM కరీంనగర్General
సైబర్ మోసాల పట్ల వయోవృద్ధులు అప్రమత్తంగా ఉండాలి - Udayam
కరీంనగర్ ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటీపీ, పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పవద్దని, అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయవద్దని ఎస్ఐ జ్యోత్స్న సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు సంఘాల అధ్యక్షులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...