Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ కేసులో ఐదుగురికి రిమాండ్

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 9:44 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
సైబర్ కేసులో ఐదుగురికి రిమాండ్ - Udayam
రామచంద్రాపురానికి చెందిన సుంచు సునీల్ ఖాతా నుంచి రూ.51,956 కాజేసిన కేసులో ఐదుగురిని రిమాండ్ చేశారు. సెప్టెంబర్ 6న బాధితుడు ఫిర్యాదు చేయగా, సీఐ ఎల్లయ్య ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు చర్లపల్లి జైలులో ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరిచారు. అభిషేక్ కుమార్, అశుతోశ్ కుమార్, కుమార్ నిషు, రితేశ్ కుమార్, అభినాశ్ కుమార్‌లకు కోర్టు రిమాండ్ విధించింది.

Comments

G
Loading comments...