వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో ఈనెల 29, 30, 31న జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు బొబ్బిలి మండలం పారాది జిల్లా పరిషత్ పాఠశాలలో శిక్షణ ఇస్తున్నట్లు పీఈటీ ఎన్.వెంకటనాయుడు తెలిపారు.
ఈనెల 25 వరకు శిక్షణ ఇస్తామన్నారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బేబినాయన, సభ్యులు సహకారంతో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయి పోటీలలో విజేతగా నిలిచేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
Comments
Loading comments...

