వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధూర్ గ్రామానికి చెందిన సాదుల్లా అకస్మిక మరణంతో ఆయన కుటుంబానికి అండగా 10వ తరగతి మిత్రులు నిలిచారు.
మిత్రులందరూ కలిసి రూ.51,000 సేకరించి, సాదుల్లా కుమార్తె పేరుపై పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో ఆ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టసమయంలో మానవత్వం చాటిన మిత్రుల సేవను గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

