Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.703 కోట్ల బీమాతో జీఎస్‌బీ గణపతి

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:53 PM జాతీయంGeneral
రూ.703 కోట్ల బీమాతో జీఎస్‌బీ గణపతి - Udayam
ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో కొలువైన ప్రసిద్ధ జీఎస్‌బీ మహాగణపతి విగ్రహానికి రికార్డు స్థాయిలో రూ.703.27 కోట్ల భారీ బీమా కల్పించారు. మండపంలోని కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది 72వ గణేశోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు జరిగే ఈ వేడుకల్లో నిత్యం వేలాది మందికి అన్నదాన సేవ అందించనున్నారు.

Comments

G
Loading comments...