వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్ ఔషధాన్ని రిటైలర్లకు రూ.2,700కే అందిస్తుండగా ఆసుపత్రులు రూ.27,000 వసూలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆసుపత్రులే మందులు విక్రయించే విధానాన్ని కేంద్రం పరిశీలించాలని సూచించింది.
ఔషధాల ధరల నియంత్రణ, జనరిక్ మందుల వినియోగంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారించింది. ఆసుపత్రులు, ఔషధాలపై నియంత్రణ చర్యలు అవసరమని పేర్కొంది.
Comments
Loading comments...

