Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.194 కోట్లతో అమరజీవి జలధార పథకం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:24 PM తూర్పుగోదావరి General
రూ.194 కోట్లతో అమరజీవి జలధార పథకం - Udayam
రాజమండ్రి రూరల్‌, కడియం మండలాల్లో ఇంటింటికీ శుద్ధి చేసిన గోదావరి జలాలు అందించేందుకు రూ.194 కోట్లతో అమరజీవి జలధార పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ పథకంతో 22,376 కుటుంబాలకు ప్రయోజనం కలగనుందని పేర్కొన్నారు. ఏడాదిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.2,200 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...