Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం 2కే రన్‌

Follow Udayam on Google
Harika Aug 22, 2026 1:09 PM మహబూబాబాద్ General
డ్రగ్స్‌ రహిత సమాజం కోసం 2కే రన్‌ - Udayam
గూడూరులో డ్రగ్స్‌ రహిత సమాజం లక్ష్యంగా పోలీసులు శనివారం 2కే రన్‌ నిర్వహించారు. మహబూబాబాద్‌ ఎస్పీ డా. శబరీశ్‌ జెండా ఊపి రన్‌ను ప్రారంభించగా, 1,000 మందికి పైగా విద్యార్థులు, యువత పాల్గొన్నారు. డ్రగ్స్‌, గంజాయికి యువత దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై సమాచారం అందించిన వారికి రూ.5 వేల వరకు బహుమతి అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...