Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల దీక్ష

Follow Udayam on Google
Sai Kumar Jun 12, 2026 7:50 AM హైదరాబాద్General
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల దీక్ష - Udayam
పెండింగ్‌ బకాయిల విడుదలకు డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ విశ్రాంత కార్మికులు జూన్‌ 18న బస్‌భవన్‌ వద్ద ‘ఒక్కరోజు ఉపవాస దీక్ష’కు పిలుపునిచ్చారు. 2017, 2021 ఏరియర్స్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్లు, గ్రాట్యుటీ డిఫరెన్స్‌ డబ్బులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ డిమాండ్‌ చేస్తోంది. పీఎఫ్‌ సమస్యల వల్ల హయ్యర్‌ పెన్షన్‌ ఆగిపోయిందని, ఎంతమందికి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దీక్షలో 10వేల మంది పాల్గొంటారని తెలిపారు.

Comments

G
Loading comments...