వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీ ప్రైవేటీ కరణ పై ప్రభుత్వ స్పష్టత

ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న వదంతుల్లో ఎలాంటి నిజం లేదని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. సంస్థ ఆస్తులను ఎవరికీ విక్రయించడం లేదని, ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించడం లేదని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో కొత్తగా 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, వాటిలో ఆర్టీసీ సిబ్బందే డ్రైవర్లుగా ఉంటారని తెలిపారు. ఉద్యోగులకు పూర్తి భద్రత ఉంటుందని, దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.
Comments
Loading comments...