Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ప్రైవేటు ఈ-బస్సుల ప్రతిపాదనపై ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం

Ravi Shukla Jun 09, 2026 6:10 AM అమరావతి 1 viewsabout 1 hour ago
ప్రైవేటు ఈ-బస్సుల ప్రతిపాదనపై ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం - Udayam Digital
ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించవద్దని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఆర్టీసీనే స్వయంగా వీటిని కొనుగోలు చేసి నడపాలని కోరింది. సంస్థలో తక్షణమే 4 వేల కొత్త బస్సులు కొనుగోలు చేసి, 10 వేల మంది సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేసింది. పీఆర్‌సీ, డీఏ బకాయిలపై చర్చించిన జేఏసీ, తమ డిమాండ్ల వినతిపత్రాన్ని ఈ నెల 11న ఆర్టీసీ ఎండీకి అందజేయనుంది.

Comments

G
Loading comments...