వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలోని బేతంచర్ల మండలం పరిధిలోని ఎంబాయి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాగ విజయప్ప 63 రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
బుధవారం బేతంచర్ల పట్టణం నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా, ఎన్‌హెచ్ 340బీ కూడలి వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నాగ విజయప్పను మరో వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

