Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు లభ్యం

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 8:44 AM అనంతపురంక్రైమ్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు లభ్యం - Udayam
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని 44 హైవేపై గురువారం సాయంకాలం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి వివరాలు లభ్యమైనట్లు గుత్తి సీఐ రామారావు శుక్రవారం మీడియాకు తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. మృతుడు గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన శీనప్పగా గుర్తించారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించామన్నారు.

Comments

G
Loading comments...