వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన సాకలి శంకర్ సోమవారం ఉదయం మృతి చెందాడు. ఆగస్టు 31న మహారాష్ట్రలో పుణ్యక్షేత్రాల దర్శనం ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా తోటాంబ సమీపంలో జీపు బోల్తాపడిన ఘటనలో శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, శంకర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం కన్నుమూశాడు.
Comments
Loading comments...

