వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం వన్నె దొడ్డి గ్రామ సమీపంలోని 44 హైవేపై శుక్రవారం బైకు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో రసూల్ అనే చికెన్ వ్యాపారికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పని నిమిత్తం ప్యాపిలి నుండి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
Comments
Loading comments...

