వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు–రాయచూరు అంతర్రాష్ట్ర రోడ్డు పనులతో గట్టు మండలం మిట్టదొడ్డి శివారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలతో ఎగసిపడుతున్న దుమ్ము వల్ల పత్తి, విత్తనపత్తి, మిరప, కంది పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

