Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండచరియలు విరిగిపడి ఎనిమిదిమంది మృతి

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 19, 2026 6:32 PM జాతీయంGeneral
కొండచరియలు విరిగిపడి ఎనిమిదిమంది మృతి - Udayam
నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. సుమారు 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు, అస్సాం రైఫిల్స్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...