Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళను బంధించి ఇంట్లో దోపిడీ.. దుండగుల కోసం గాలింపు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 03, 2026 2:34 PM నిజామాబాద్General
మహిళను బంధించి ఇంట్లో దోపిడీ.. దుండగుల కోసం గాలింపు - Udayam
నిజామాబాద్‌ హాస్మీకాలనీలో ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఇంట్లోకి చొరబడి మహిళను బంధించి దోపిడీకి పాల్పడ్డారు. ఆమెను బెదిరించి బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. దోచుకెళ్లిన సొత్తు విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని అంచనా. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌, ఫింగర్‌ ప్రింట్‌ బృందాలు ఆధారాలు సేకరించాయి.

Comments

G
Loading comments...