వార్తలకు తిరిగి వెళ్లండి

మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతిని, నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను గ్రామస్థులు సర్పంచ్ సంగెం అరుణ గట్టయ్య దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై ఆమె వెంటనే స్పందించి టిప్పర్ ద్వారా కంకర చిప్స్ తెప్పించి, ట్రాక్టర్ సహాయంతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా మారడంతో గ్రామస్థులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

