Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేటలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 10, 2026 3:30 PM కాకినాడGeneral
జగ్గంపేటలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి - Udayam
జగ్గంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో రాజపూడికి చెందిన గాది మణికంఠ మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సత్తెమ్మ తల్లి గుడి వద్ద అదుపుతప్పి సైకిల్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సీహెచ్‌సీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు.

Comments

G
Loading comments...