వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన లక్షెట్టిపేట మండలంలోని రంగంపేట గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్సై సురేష్ వివరాల ప్రకారం రంగంపేట గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశం ఈనెల 15న మద్యం సేవించడంతో ఆయన భార్య మందలించిందన్నారు.
దీంతో మనస్థాపం చెందిన వెంకటేశం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు హైదరాబాద్కు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు.
Comments
Loading comments...

