Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజక చెరువు పరిరక్షణకు కలెక్టర్‌కు వినతి

Follow Udayam on Google
RAGHU SKLM Aug 31, 2026 4:09 PM శ్రీకాకుళంGeneral
రజక చెరువు పరిరక్షణకు కలెక్టర్‌కు వినతి - Udayam
పాత శ్రీకాకుళం సంతోషిమాత ఆలయం వద్ద గల రజకుల చెరువును కాపాడాలని కోరుతూ జై సంతోషిమాత రజక సంఘం సభ్యులు సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. వందేళ్లుగా 30 కుటుంబాలు కోమటి బంధంపై ఆధారపడి జీవిస్తున్నామని, గెడ్డ పూడిపోవడంతో నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. శిథిలమైన ధోబీ ఖానాలను పునర్నిర్మించి, చెరువుకు పట్టా మంజూరు చేసి ఆక్రమణల నుంచి కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...