వార్తలకు తిరిగి వెళ్లండి

శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు పెద్ద నాగులవరం గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మార్కాపురానికి పనుల నిమిత్తం వెళ్లే స్థానిక గ్రామస్థుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గతంలో ఈ వాగు దాటుతూ పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా పోలీస్ సిబ్బందిని మోహరించారు.
Comments
Loading comments...

