వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సబ్బాని రవీందర్ సోమవారం పదవీ విరమణ పొందారు. గత 29 ఏళ్లుగా ఫిజికల్ సైన్స్ టీచర్‌గా విశేష సేవలు అందించి నేడు పదవి విరమణ పొందడంతో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ముడుతనపల్లి మోహన్ ఆయనను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపి ఆయన సేవలను కొనియాడారు.
Comments
Loading comments...

