Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీసర్వే పనులు వేగంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:11 PM జోగులాంబ గద్వాల్ General
రీసర్వే పనులు వేగంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ - Udayam
భూ రీసర్వే పనులను ఎలాంటి వివాదాలకు తావులేకుండా వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మల్దకల్ మండలం బూడిదపాడులో రీసర్వే పనులు, రికార్డులను పరిశీలించారు. రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు వినియోగించుకుని పనులను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...