Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకు బియ్యం విక్రయాలు: మంత్రి నాదెండ్ల

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 30, 2026 4:30 PM గుంటూరుGeneral
ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకు బియ్యం విక్రయాలు: మంత్రి నాదెండ్ల - Udayam
ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకు బియ్యం విక్రయాలను విస్తృతంగా చేపట్టాలని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్లు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. బియ్యం నాణ్యతలో రాజీ లేకుండా జిల్లాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేసి విక్రయాలను సమర్థంగా పర్యవేక్షించాలని సూచించారు.

Comments

G
Loading comments...