వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లాడ మండలంలో సాగునీరు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి. ఎల్నినో ఎండల ప్రభావంతో వాగులు, కాలువలు ఎండిపోగా, బోర్లలోనూ నీళ్లు రావడం లేదు. బిల్లుపాడు, రామచంద్రాపురం, మువ్వగూడూరు పరిధిలో సుమారు 2,000 ఎకరాల వరి పైరు ఎండిపోతోంది.
రైతులు తమ పెట్టిన పెట్టుబడులు మట్టిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

