Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం, కుక్కర్ ఆఫర్లతో బడిబాట

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 15, 2026 3:11 PM సూర్యాపేటGeneral
బియ్యం, కుక్కర్ ఆఫర్లతో బడిబాట - Udayam
విద్యార్థులు లేక మూతపడిన ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించేందుకు నాగులపహాడ్ గ్రామ పంచాయతీ, ఎన్‌ఆర్‌ఐలు నడుం బిగించారు. బడిలో చేరే పిల్లల కుటుంబాలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో పాటు విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, పుస్తకాలు, హైస్కూల్‌కు వెళ్లే వారికి సైకిళ్లు అందజేస్తామన్నారు. జీరో ఎన్‌రోల్‌మెంట్ నుంచి పాఠశాలను రక్షించుకునేందుకు గ్రామస్థులు చేస్తున్న ఈ ప్రయత్నం విశేషంగా ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...