Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువు ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 08, 2026 11:02 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
చెరువు ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు - Udayam
జీవీఎంసీ 69వ వార్డు నాతయ్యపాలెంలోని కృష్ణ మహంతి చెరువు వద్ద ప్రభుత్వ స్థలంలో చేపట్టిన ఆక్రమణలను రెవెన్యూ అధికారులు శుక్రవారం తొలగించారు. ఆర్‌ఐ మృదుల ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. ఆక్రమణల తొలగింపును కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చేరుకుని ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు చేపట్టడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...