Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మంగళవారం వేడుకలు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 04, 2026 5:49 PM జనగామ General
రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మంగళవారం వేడుకలు - Udayam
జనగామ మూడో వార్డు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢమాసం మూడో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి నిమ్మకాయల మాలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులు పూజలు చేశారు. పూజారి శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో కుంకుమార్చన, నైవేద్య సమర్పణ కార్యక్రమాలు జరిగాయి. రోగాలు తొలగి, పంటలు పండాలని భక్తులు ప్రార్థించారు. మహిళలు గోరింటాకు వేడుకలు నిర్వహించారు.

Comments

G
Loading comments...