వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ అర్బన్ సీడీపీవో కవితకు గాయాలయ్యాయి. తిమ్మాపూర్లోని భారత్ గ్యాస్ ఆఫీస్ వద్ద రాజీవ్ రహదారిపై ముందుగా వెళుతున్న కారు అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి వెళ్తున్న సీడీపీవో కవిత ఉన్న కారు ఢీ కొట్టింది.
ప్రమాదంలో కవితకు గాయాలు కాగా ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

