వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో సోమేశ్వర స్వామి పుష్కరిణి ఆక్రమణల తొలగింపులో రెవెన్యూ అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ హిందూ ధార్మిక సంఘాలు శివాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా అధికారులు అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. 3 రోజుల్లోగా ఆక్రమణలు తొలగించకపోతే సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

