Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో మహిళ అండాశయం నుంచి 5.2 కిలోల కణితి తొలగింపు

Follow Udayam on Google
రవళి దేవి Jul 30, 2026 3:39 PM ములుగు General
ములుగులో మహిళ అండాశయం నుంచి 5.2 కిలోల కణితి తొలగింపు - Udayam
ములుగు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి 41 ఏళ్ల మహిళ అండాశయం నుంచి 5.2 కిలోల కణితిని విజయవంతంగా తొలగించారు. కడుపు నొప్పితో ఆస్పత్రికి రాగా పరీక్షల్లో కణితి ఉన్నట్లు గుర్తించారు. సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...