Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన పంచాయతీలకు సడలింపులివ్వాలి: సీతక్క

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 04, 2026 8:41 AM హైదరాబాద్General
గిరిజన పంచాయతీలకు సడలింపులివ్వాలి: సీతక్క - Udayam
మారుమూల, గిరిజన ప్రాంతాల గ్రామ పంచాయతీలపై అదనపు పన్నుల భారం మోపకుండా, కేంద్రం ఇచ్చే పనితీరు ఆధారిత గ్రాంట్ల నిబంధనల నుండి వీటికి ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు. దిల్లీలో జరిగిన పంచాయతీరాజ్ సదస్సులో పాల్గొన్న ఆమె.. కేవలం పన్నుల వసూళ్లతోనే పంచాయతీల పనితీరును అంచనా వేయవద్దని, కోర్టు కేసుల వల్ల ఎన్నికలు జరగని 62 గ్రామాలకు నిధులు కొనసాగించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...