వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూముల విలువ పెంచడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య సగానికి పడిపోయింది. మార్కెట్ మందగమనం, పెరిగిన రిజిస్ట్రేషన్ ఖర్చుల కారణంగా సామాన్య కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిత్యం జరిగే లావాదేవీలు 50 శాతం వరకు తగ్గిపోయాయి.
దీనివల్ల ప్రభుత్వ ఆదాయం క్షీణించడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు సామాన్యులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపాయని వ్యాపారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

