Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజిస్ట్రేషన్లు బంద్.. ప్రభుత్వ ఆదాయానికి గండి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 08, 2026 12:09 PM తూర్పుగోదావరి General
రిజిస్ట్రేషన్లు బంద్.. ప్రభుత్వ ఆదాయానికి గండి - Udayam
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుబంధంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (RSK) ఏర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ దస్తావేజు లేఖర్లు నిర్వహించిన పెన్‌డౌన్‌ ఆందోళనతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ఆర్‌ఎస్‌కేల ఏర్పాటుతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని లేఖర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...