Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపుర వార్డులో ఎమ్మెల్యే పార్థసారథి పర్యటన

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 08, 2026 12:45 PM కర్నూలుGeneral
ఖాజీపుర వార్డులో ఎమ్మెల్యే పార్థసారథి పర్యటన - Udayam
ఆదోని పట్టణంలోని ఖాజీపుర వార్డులో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో ప్రజలు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరాతో పాటు ఇళ్ల స్థలాలు, పింఛన్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పలువురు బాధితులు వైద్యం, ఆర్థిక సాయం అందించాలని కోరగా.. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ నయీం అహ్మద్, ఇతర శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...