వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (RRR) నార్త్ పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా 161.5 కి.మీల ఈ రోడ్డు నిర్మాణానికి గత రెండేళ్లలో NHAI మూడుసార్లు టెండర్లు పిలిచింది. ప్లానింగ్ మార్పులు, సాంకేతిక సమస్యల వల్ల మొదటి రెండుసార్లు విఫలమయ్యాయి.
ప్రస్తుతం ప్యాకేజీలను కుదించి రూ.9,361 కోట్లతో మూడోసారి టెండర్లు పిలిచినా, కేంద్రం నుంచి ఫైనాన్షియల్ అప్రూవల్ రాక పనులు మొదలుకాలేదు. నిరంతరం మారుతున్న నిబంధనలు, అనుమతుల ఆలస్యం ప్రాజెక్టును మరింత జాప్యం చేస్తున్నాయి.
Comments
Loading comments...

